భూ సంబంధిత అర్జీదారులు, ఫిర్యాదుదారుల అర్జీల పట్ల భాధ్యతాయుతంగా వ్యవహరించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఇంఛార్జి కలెక్టర్, జేసీ అదితి సింగ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లోని సభాభవన్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) లో వచ్చిన ఫిర్యాదులపై డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చంద్రమోహన్, చిన్నయ్య, సర్వే ల్యాండ్స్ ఏడీ మురళీ కృష్ణ , మండలాల తహశీల్దార్లు, ఆర్ఐ, ఎంపిడివోలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ వ్యవస్థ నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోందని, ప్రభుత్వ సేవలు, రెవెన్యూ అంశాలు, పీవోటీ యాక్ట్ ప్రకారం అసైన్డ్ భూముల పరిష్కారంలో ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని వచ్చిన ఫిర్యాదులకు సరైన పరిష్కార నివేదికలు కూడా అందలేదన్నారు. అలాగే.. సెక్షన్ 22-ఏ డెలిషన్ సంబంధిత మండల తహశీల్దార్లు క్షేత్రస్థాయిలో ఫిర్యాదుల పట్ల విచారణ జరగాలన్నారు. ప్రభుత్వం ద్వారా మనం చేసే ప్రతి పని ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు మంచి పేరు వచ్చేలా చేపట్టాలన్నారు. డీఆర్వో విశ్వేశ్వర నాయుడు మాట్లాడుతూ… అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విధి నిర్వహణలో వర్చువల్ గవర్నెన్స్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయి విజిట్ కు వెళ్లేముందు ముందస్తు ప్రణాళికతో వెళ్లాలని, అవసరమనుకున్న చోట ఆకస్మిక తనిఖీలు నిర్వహిండం ద్వారా మంచి ఫలితాలను చూడవచ్చునని పేర్కొన్నరు. 
