
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా రెడ్యం వెంకట సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు పార్టీ అధిష్టానవర్గం ప్రకటించింది. రెడ్యంకు పార్టీలో కీలక పదవి లభించడంతో ఆయన అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆయన అభిమానులు ఖాజీపేట కూడలి చేరుకుని మహాత్మాగాంధి, పొట్టిశ్రీరాములు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాణాసంచా పేల్చారు. మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు.