కడప జిల్లా మైదుకూరు మండలం జీవీసత్రం సమీపంలో 67వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం  ఆర్టీసీ కడప డిపోకు చెందిన బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. విజయవాడ నుంచి కడపకు వస్తున్న సూపర్ లగ్జరీ బస్సు మార్గమధ్యంలోని జీవీసత్రం వద్ద బైపాస్ పైకి చేరుకుంది.  జీవీసత్రంలో దిగాల్సిన ప్రయాణికులు ఉండటంతో బైపాస్ నుంచి జీవీసత్రం వైపు బస్సును మళ్లించారు. దాదాపు 2 అడుగుల ఎత్తు నుంచి బస్సు జీవీసత్రం దారిలోకి మళ్లే సమయంలో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాద సమయంలో 30మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తూ ఉండగా అధికారులు 8మంది మాత్రమే ఉన్నట్లు చెెబుతున్నారు.  బోల్తాపడిన బస్సును పునరుద్ధరించి కడపకు తరలించారు.
