
శెట్టిపల్లె పెద్ద నాగిరెడ్డి. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పెదనాన్న. చాపాడు మండలం నక్కలదిన్నె గ్రామానికి చెందిన పెద్దనాగిరెడ్డి 18వ ఏటనే అఖిల భారత కాంగ్రెస్ సభ్యుడిగా చేరి ప్రొద్దుటూరు తాలూకా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాష్ట్ర, జిల్లా సభ్యుడిగా ప్రొద్దుటూరు పరిధిలోని ఓబాయపల్లి పంచాయతీ బోర్డు అధ్యక్షుడుగా మూడుసార్లు పోటీ లేకుండా ఎన్నికయ్యారు. 1959లో మైదుకూరు పంచాయతీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1967 ఫిబ్రవరి నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1972లో జరిగిన ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. మద్యపాన నిషేధ సవరణ బిల్లుపై నియమించిన కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.