Skip to main content

Baskar Pedia

జిల్లాలో ఎప్పటిలాగే యథావిధిగా విమానయాన సేవలు కొనసాగిస్తున్నామని, భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందిస్తామని కడప ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సుజిత్ కుమార్ పోద్దార్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం కడప విమానాశ్రయంలో ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఇండిగో విమాన సేవల సంక్షోభం తరువాత భవిష్యత్తులో కడప విమానాశ్రయం అందించే సేవలను వివరించారు. 2025 డిసెంబర్ మొదటి వారంలో జరిగిన ఇండిగో (IndiGo) సంక్షోభం తరువాత ప్రస్తుతం కడప విమానాశ్రయం నుంచి అన్ని విమానాలు నిర్ణీత సమయానికి నడుస్తున్నాయి. సగటున ప్రతిరోజూ 200 మంది ప్రయాణికులు కడప విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్నారు. కొత్త బేబీ కేర్ (శిశు సంరక్షణ) సేవ కూడా త్వరలో ప్రారంభం కానుంది. సెక్యూరిటీ హెల్డ్ ఏరియా (SHA)లో కొత్త స్నాక్ బార్ సౌకర్యం త్వరలో ప్రారంభం అవుతుంది. కడప విమానాశ్రయం నుండి కడప నగరానికి బస్సు సర్వీసును పరిగణలోకి తీసుకోవాలని స్థానిక ఎంపీని మరియు జిల్లా యంత్రాంగాన్ని AAI కోరింది. APSRTC బస్సుల కోసం విమానాశ్రయంలో బస్ స్టాప్ ఇప్పటికే ఏర్పాటు చేయబడింది. కొత్త ఏటీసీ (ATC) టవర్ మరియు కొత్త ఫైర్ స్టేషన్ ఏర్పాటు విషయం కూడా AAI మేనేజ్ మెంట్ పరిశీలనలో ఉంది. ఫ్లైట్ (ట్రైనింగ్ స్కూల్ (FTO) త్వరలో ప్రారంభం కానుంది. ఇది కడప యువతకు భవిష్యత్ పైలట్లుగా మారడానికి అవకాశం కల్పిస్తుంది. స్థానిక సంస్థలు లేదా వ్యాపారుల నుండి డిమాండ్ ఉంటే, కడప విమానాశ్రయం నుండి కార్లో (సరుకు రవాణా) కార్యకలాపాలను ప్రారంభించాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యోచిస్తోందని తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *